రూ.1.82 కోట్ల విలువైన 365 కిలోల గంజాయి పట్టివేత
మూడు వాహనాలు స్వాధీనం.. నలుగురు నిందితుల అరెస్ట్
భద్రాచలం,ఆధాబ్ న్యూస్: ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు మూడు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. మొత్తం 365.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా, దాని విలువ సుమారు రూ.1.82 కోట్లు ఉంటుందని ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు.
భద్రాచలంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్ సమీపంలో డీటీఎఫ్ కొత్తగూడెం బృందం తనిఖీలు నిర్వహిస్తుండగా ముందుగా బైక్పై వస్తున్న ఒరిస్సాకు చెందిన **దివాకర్ మండల్ (22)**ను తనిఖీ చేయగా 9 కిలోల గంజాయి లభించింది. దీంతో బైక్ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అదే సమయంలో బైక్ వెనుక వస్తున్న హ్యుందాయ్ కారుపై అనుమానం రావడంతో ఎక్సైజ్ సిబ్బంది తనిఖీ చేయగా కారులో 100 కిలోల గంజాయి పట్టుబడింది. కారులో ఉన్న ఒరిస్సాకు చెందిన ఎలక్ట్రిషియన్ **సుమన్ పాల్ (22)**ను అదుపులోకి తీసుకున్నారు.
బైక్, కారులో పట్టుబడిన నిందితులను విచారించగా మరో లారీలో కూడా గంజాయి ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. దీంతో కరుణగిరి వద్ద నిలిపి ఉంచిన లారీని తనిఖీ చేయగా అందులో 263.2 కిలోల గంజాయి లభించింది. లారీలో ఉన్న **రాజశేఖర్ మార్గి (22), క్లీనర్ బ్రిజన్ నాసా (20)**లను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ కూడా ఒరిస్సాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
ఈ ఆపరేషన్లో డీటీఎఫ్ కొత్తగూడెం సీఐ రమాదేవి, సీఐలు కిష్టయ్య, నరేందర్ రెడ్డి, ఎస్ఐలు సలీముల్లా ఖాన్, శ్రీధర్ రావుతో పాటు సిబ్బంది కరీం, మౌలాంకర్, వీరబాబు, శ్రీనివాస్, నర్సింహరావు, రమేష్, పార్థసారధి, విల్సన్, సీతారాం, వీరభద్రం, రాకేష్, కిరణ్, ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.
గంజాయి అక్రమ రవాణాను అడ్డుకుని భారీగా గంజాయి పట్టుకున్న ఖమ్మం ఎక్సైజ్ బృందాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అవినాష్ మహంతి, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ అంజన్ రావు, ఖమ్మం డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అభినందించారు.









