గుండాల, బోడు, కొమరారం పోలీస్ స్టేషన్లను సందర్శించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గుండాల, బోడు, కొమరారం పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లలోని కేసుల దర్యాప్తు, రికార్డులు, పోలీసుల విధుల నిర్వహణపై సమీక్షించారు.
సీసీటీఎన్ఎస్ 2.0లో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచి వాటిని నియంత్రించాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచనలు చేశారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సూచించారు.
Post Views: 30









