గట్టమ్మ అమ్మవారిని దర్శించుకున్న సినీ నటుడు నాని
ములుగు ,ఆధాబ్ న్యూస్: ములుగు జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ గట్టమ్మ దేవాలయాన్ని సినీ నటుడు నాని దర్శించుకున్నారు. ఇటీవల విడుదలైన నాని నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో చిత్రయూనిట్‌తో కలిసి మేడారం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు నాని బయలుదేరారు.
ఈ క్రమంలో ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్దకు చేరుకున్న నాని అక్కడ కొద్దిసేపు ఆగి గట్టమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిత్రయూనిట్‌తో కలిసి మేడారం వైపు బయలుదేరారు. నాని గట్టమ్మ ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆయనను చూసేందుకు ఆసక్తి చూపించారు.
Post Views: 72









