ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి
– జిల్లా కలెక్టర్ అంకిత్
కొత్తగూడెం ఆధాబ్ న్యూస్: సెప్టెంబర్ 28వ తేదీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 10 గంటలకు సకాలంలో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని కోరారు.
ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖాధికారులు వెంటనే స్వీకరించి, వాటిపై తగిన చర్యలు తీసుకునేలా చూడాలని ఆదేశించారు.
జిల్లా ప్రజల సౌకర్యార్థం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లోనూ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ కోరారు.









