థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం.. బ్యాంకాక్‌లో ఆందోళనకర పరిస్థితులు
బ్యాంకాక్ ఆధాబ్ న్యూస్: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. నగరంలోని మొత్తం 50 జిల్లాలపై వరద ప్రభావం పడినట్లు సమాచారం. భారీగా నీరు చేరడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
బ్యాంకాక్‌లోని ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలను సైతం వరద నీరు చుట్టుముట్టింది. ఎయిర్‌పోర్టు, బస్టాండ్లు, ప్రధాన రహదారులు చెరువులను తలపించేలా మారాయి. దీంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరో మూడు రోజుల పాటు బ్యాంకాక్‌కు వరద ముప్పు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
Post Views: 28









