కంటైనర్‌ను ఢీకొట్టిన అడిషనల్ కలెక్టర్ కారు
ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన వేణుగోపాల్
నార్కట్‌పల్లి, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ ప్రయాణిస్తున్న కారు ఆదివారం ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని కామినేని ఆస్పత్రి వద్ద ఫ్లైఓవర్‌పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ముందుగా వెళ్తున్న కంటైనర్ యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన అడిషనల్ కలెక్టర్ కారు కంటైనర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం దెబ్బతింది. అయితే వేణుగోపాల్ సురక్షితంగా బయటపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న కారును ఇన్సూరెన్స్ ప్రక్రియ నిమిత్తం అక్కడే ఉంచారు. అనంతరం పోలీసులు వేణుగోపాల్‌కు అల్పాహారం ఏర్పాటు చేశారు. సివిల్ సప్లైస్ అధికారి కారులో ఆయన కొత్తగూడెం బయలుదేరి వెళ్లారు.
Post Views: 42









