ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  బాలికల సదనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మేజిస్ట్రేట్ చిన్నారుల సమస్యలు అడిగి తెలుసుకున్న కంబపు సూరి రెడ్డి

బాలికల సదనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మేజిస్ట్రేట్

చిన్నారుల సమస్యలు అడిగి తెలుసుకున్న కంబపు సూరి రెడ్డి

మణుగూరు, సెప్టెంబర్ 26 (ఆధాబ్ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల న్యాయ సేవా కమిటీ ఛైర్మన్, ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కంబపు సూరి రెడ్డి శనివారం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం బాలిక సదనం (చిల్డ్రన్ హోం)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా సదనంలోని గదులు, వంటగది, ఆవరణ, పరిసరాలను పరిశీలించిన మేజిస్ట్రేట్.. పరిశుభ్రత, వసతి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించి వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, భోజనం, వైద్యం, విద్య, ఇతర సౌకర్యాలు సక్రమంగా అందుతున్నాయా అని ఆరా తీశారు.

చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై కూడా మేజిస్ట్రేట్ వివరాలు తెలుసుకుని, అవసరమైన వైద్య పరీక్షలను సకాలంలో నిర్వహించాలని సదనం నిర్వాహకులకు సూచించారు. బాలికలు చదువుపై శ్రద్ధ పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులకు భయపడకుండా ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు.

ఏదైనా సమస్య ఎదురైతే సదనం నిర్వాహకులు, సంబంధిత అధికారులు లేదా న్యాయ సేవా సంస్థల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పిల్లల హక్కుల పరిరక్షణకు న్యాయ సేవా సంస్థలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

అనంతరం సదనం నిర్వాహకులతో మాట్లాడిన మేజిస్ట్రేట్.. బాలికలకు అందుతున్న ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు, విద్యా సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సదనంలో పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తూ చిన్నారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

తనిఖీ అనంతరం మేజిస్ట్రేట్ కంబపు సూరి రెడ్డి బాలికలకు స్వయంగా భోజన పదార్థాలను వడ్డించారు. ఆహారం రుచిగా ఉందా అని బాలికలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సదనం చైల్డ్ వెల్ఫేర్ అధికారిణి దీప్తి రాణి, న్యాయవాది అంకం సర్వేశ్, లీగల్ సెల్ కోఆర్డినేటర్ రవీందర్, సదనం అసిస్టెంట్ కుమారి, కోర్టు కానిస్టేబుల్ బుచ్చిబాబు, హోంగార్డు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు