ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వాగులు, వంకలు దాటొద్దు.. విద్యుత్‌ వైర్లకు దూరంగా ఉండాలి

కరకగూడెం తహసీల్దార్‌ వట్టం కాంతయ్య సూచనలు

కరకగూడెం, సెప్టెంబర్ 24 (ఆధాబ్ న్యూస్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కరకగూడెం మండలంలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ వట్టం కాంతయ్య సూచించారు.

వర్షాలు కురుస్తున్న సమయంలో అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని కోరారు. లోతట్టు ప్రాంతాలు, చెరువులు, వాగులు, వంకల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు నీటి ప్రవాహాల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని తెలిపారు.

వరద నీరు రహదారులపై ప్రవహిస్తున్న సమయంలో వాహనాలతో దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. విద్యుత్‌ స్తంభాలు, తెగిపడిన విద్యుత్‌ వైర్లకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు.

వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు లేదా వరద పరిస్థితులు ఏర్పడితే వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని తహసీల్దార్‌ కాంతయ్య కోరారు. ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు