ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  సాయిబాబా ఆలయానికి రూ.3.5 లక్షల విలువైన రథం బహూకరణ తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

సాయిబాబా ఆలయానికి రూ.3.5 లక్షల విలువైన రథం బహూకరణ

తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

సారపాక, సెప్టెంబర్ 24 (ఆధాబ్ న్యూస్): బూర్గంపాడు మండలం సారపాకలోని షిరిడి పుష్కర ద్వారక సాయిబాబా ఆలయానికి తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.3.5 లక్షల విలువైన రథాన్ని బహూకరించారు.

గురువారం ట్రస్ట్ ఛైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య, ట్రస్ట్ డైరెక్టర్ వల్లూరిపల్లి వంశీకృష్ణ–విజయరేణుక దంపతులు ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయానికి సమర్పించిన రథాన్ని ఆలయ కమిటీ బాధ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ ఛైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య మాట్లాడుతూ తమ కుమారుడు, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్–నీలిమ దంపతుల సౌజన్యంతో స్వామివారికి రథాన్ని సమర్పించినట్లు తెలిపారు. ఆలయానికి రథాన్ని అందించడం ఆనందంగా ఉందని, భక్తులకు ఉపయోగపడేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సింగమనేని భాస్కరరావు, తీగల జీవన్‌రెడ్డి, ఊటుకూరి రమణమూర్తి, అక్కెర భాస్కరాచారి, కొత్తపల్లి సత్యనారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు