ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  గోండి భాష పరిరక్షణకు వర్క్‌షాప్‌ గోండి భాషకు 8వ షెడ్యూల్‌లో గుర్తింపు కల్పించాలి భాషా, సంస్కృతి పరిరక్షణకు అందరూ కృషి చేయాలి

గోండి భాష పరిరక్షణకు వర్క్‌షాప్‌

గోండి భాషకు 8వ షెడ్యూల్‌లో గుర్తింపు కల్పించాలి

భాషా, సంస్కృతి పరిరక్షణకు అందరూ కృషి చేయాలి

భద్రాచలం, సెప్టెంబర్ 24 (ఆధాబ్ న్యూస్): ఆదివాసీల భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు వి.సి. దొర, కోశాధికారి సోలం రామారావు అన్నారు. గోండి భాషను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో అక్టోబర్ 2 నుంచి 6వ తేదీ వరకు భద్రాచలంలోని గిరిజన భవన్‌లో గోండి భాష వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ 3898/90, గోటుల్‌ గోండ్వానా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వర్క్‌షాప్‌లో గోండి భాష పరిరక్షణ, అభివృద్ధి, భావితరాలకు భాషను అందించే అంశాలపై చర్చలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

గోండి భాషకు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో అధికారిక గుర్తింపు కల్పించి చేర్చాలని వారు డిమాండ్‌ చేశారు. గోండి భాష, సంస్కృతి పరిరక్షణ కోసం ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

గోండి భాషపై ఆసక్తి ఉన్న ఆదివాసీ యువత, విద్యార్థులు, భాషాభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వర్క్‌షాప్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్‌ డాక్టర్‌ చందా లింగయ్య దొరను నిర్వాహకులు ఆహ్వానించినట్లు తెలిపారు.

ఆదివాసీ భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని వి.సి. దొర, సోలం రామారావు కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు