ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ దూకుడు 8 మంది అనుమానిత బినామీల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ దూకుడు

8 మంది అనుమానిత బినామీల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (ఆధాబ్ న్యూస్): డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసు దర్యాప్తులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దూకుడు పెంచారు. కేసు దర్యాప్తులో భాగంగా 8 మంది అనుమానిత బినామీలను గుర్తించిన ఏసీబీ అధికారులు, హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో వారి నివాసాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

ఏసీబీ డీఎస్పీ జి. శ్రీధర్ నేతృత్వంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. సోదాల్లో భాగంగా అనుమానితుల ఆస్తులు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

అనుమానిత బినామీల ఇళ్లలో లభిస్తున్న పత్రాలు, ఆస్తుల వివరాలు, ఇతర ఆధారాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. భీమ్‌రెడ్డి కేసులో బినామీ పేర్లతో ఆస్తులు సమకూర్చుకున్నారనే కోణంలో దర్యాప్తును మరింత ముమ్మరం చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం పుప్పాలగూడలో పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీలు పూర్తయిన అనంతరం స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఇతర ఆధారాలపై ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు