ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక పాల్వంచలో 360 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు లక్కీ డ్రా

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

పాల్వంచలో 360 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు లక్కీ డ్రా

పాల్వంచ, సెప్టెంబర్ 24 (ఆధాబ్ న్యూస్): పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. గురువారం పెద్దమ్మతల్లి ఆలయ ఫంక్షన్‌హాల్‌లో ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ అంకిత్, మేయర్ మూడ్ మూడ్ గణేష్ సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు.

పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 27 డివిజన్లకు మొత్తం 360 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పది బ్లాకుల్లో ఒక్కో బ్లాక్‌కు 36 ఇళ్ల చొప్పున మొత్తం 360 ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఇళ్ల కోసం మొత్తం 4,611 దరఖాస్తులు అందగా, క్షేత్రస్థాయి విచారణ, అర్హతల పరిశీలన అనంతరం 1,254 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. అందుబాటులో ఉన్న ఇళ్ల కంటే అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం సామాజిక వర్గాల వారీగా కేటాయింపులు చేపట్టారు. ఎస్సీ కేటగిరీకి 61, ఎస్టీ కేటగిరీకి 22, మైనారిటీలకు 43, బీసీ, ఓసీ కేటగిరీలకు 234 ఇళ్లను కేటాయించారు. దివ్యాంగులకు కూడా నిబంధనల ప్రకారం ప్రత్యేక కేటాయింపులు చేశారు. మొత్తం 18 ఇళ్లను దివ్యాంగులకు, 342 ఇళ్లను ఇతర అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా ప్రక్రియ చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ గతంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయాల్సి వచ్చిందన్నారు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులను కోరారు.

గతంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వస్తాయనే హామీతో కొంతమంది కుటుంబాలు తమ నివాసాలను ఖాళీ చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుత అర్హుల జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో వారి సమస్యను ముఖ్యమంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

నిబంధనల ప్రకారమే ఇళ్ల కేటాయింపు: కలెక్టర్ అంకిత్

జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వ మార్గదర్శకాలు, రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని, అర్హులైన వారిలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

లక్కీ డ్రా అనంతరం ఎంపికైన లబ్ధిదారుల ధ్రువపత్రాలను అధికారులు పరిశీలిస్తారని, ధ్రువపత్రాల ధృవీకరణ పూర్తయిన తర్వాత ఇళ్ల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఇళ్ల కేటాయింపు పేరుతో ఎవరైనా డబ్బులు అడిగినా, దళారులు సంప్రదించినా నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారం జరుగుతున్నందున మధ్యవర్తులకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

మేయర్ మూడ్ మూడ్ గణేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ అంకిత్‌ల సమన్వయంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుత లక్కీ డ్రాలో ఇల్లు లభించని అర్హులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, భవిష్యత్‌లో ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్లలో నిబంధనల ప్రకారం వారికి అవకాశం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అనంతరం చిన్నారుల చేతుల మీదుగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల కేటగిరీలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు. అనంతరం కేటగిరీల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేసి, ఎంపికైన వారికి ధ్రువపత్రాలను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ అంకిత్, మేయర్ మూడ్ మూడ్ గణేష్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, కొత్తగూడెం ఆర్డీవో మధు, కార్పొరేషన్ కమిషనర్ సుజాత, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, కార్పొరేటర్లు, తహసీల్దార్ దారాప్రసాద్, గృహ నిర్మాణ శాఖ పీడీ సవేరాం, అధికారులు, లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు