ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  తాటిగూడెం అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలు గర్భిణీలు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన

తాటిగూడెం అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలు

గర్భిణీలు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన

కరకగూడెం, సెప్టెంబర్ 23 (ఆధాబ్ న్యూస్): మణుగూరు ప్రాజెక్టు పరిధిలోని కరకగూడెం మండలం అనంతారం సర్కిల్ తాటిగూడెం అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో వివిధ రకాల ఆహార పదార్థాలు, చిరుధాన్యాల ప్రాముఖ్యత, వాటి వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవల గురించి తల్లులకు వివరించారు. గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ రాజమణి, సర్పంచ్ కొమరం విజయ, అంగన్‌వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు