అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
దసరాకు ముందే అర్హులకు అందేలా చర్యలు
వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశాలు
హైదరాబాద్ (ఆధాబ్ న్యూస్): తెలంగాణలో కొత్త పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం, దసరాకు ముందే అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకుని దరఖాస్తుల పరిశీలనను త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యంగా అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులకు పూర్తిస్థాయిలో పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించింది.
దసరా పండుగకు ముందే కొత్త పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమయ్యేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.









