ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  పాత కక్షలతో భీమరాజుపై కత్తులతో దాడి.. నలుగురు అరెస్ట్

పాత కక్షలతో భీమరాజుపై కత్తులతో దాడి.. నలుగురు అరెస్ట్

కరకగూడెం, సెప్టెంబర్ 23 (ఆధాబ్ న్యూస్): అశ్వాపురంపాడు గ్రామ శివారులోని ఫారెస్ట్ ప్లాంటేషన్ వద్ద ఈ నెల 19న వజ్జా భీమరాజుపై కత్తులతో దాడి చేసిన కేసులో నలుగురు నిందితులను కరకగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. అశ్వాపురంపాడు గ్రామానికి చెందిన వజ్జా భీమరాజు పశువులను మేపేందుకు ఫారెస్ట్ ప్రాంతానికి వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో భీమరాజు మెడ, తలపై తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. కోవాసి బాలకృష్ణ, లేటు పోడియం విజయ్, కోవాసి సంతోష్, పోడియం మంగయ్యలను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. గతంలో కోవాసి బాలకృష్ణ తండ్రి వెంకటేశ్వర్లు హత్యకు గురయ్యాడు. తన తండ్రి హత్యకు భీమరాజే కారణమని భావించిన బాలకృష్ణ, జైలు నుంచి విడుదలైన అనంతరం మిగిలిన ముగ్గురితో కలిసి భీమరాజుపై దాడికి పథకం వేసినట్లు తెలిపారు. పథకం ప్రకారం భీమరాజును వెంబడించి కత్తులతో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు కరకగూడెం ఎస్సై పి.వి.ఎన్. రావు తెలిపారు.

ఈ కేసు దర్యాప్తులో ఏడూళ్ల బయ్యారం సీఐ వి. వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పి.వి.ఎన్. రావుతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు