కులమతాలకు అతీతంగా వినాయకుడి లడ్డూ దక్కించుకున్న సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
కరకగూడెం, సెప్టెంబర్ 19 (ఆధాబ్ న్యూస్):
కరకగూడెం మండల కేంద్రంలో జరుగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో మత సామరస్యం, సోదరభావం చాటిచెప్పే ఘటన చోటుచేసుకుంది. పంచమ రాత్రి ఉత్సవాలు ముగిసిన సందర్భంగా కరకగూడెం గణేష్ ఉత్సవ కమిటీ, కౌండిన్య యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలం పాటలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
వేలం పాటలో ₹3,116లకు వినాయకుడి లడ్డూను సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ దక్కించుకున్నారు. కులమతాలకు అతీతంగా మానవత్వం, పరస్పర గౌరవం, సోదరభావానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ వేలంలో పాల్గొనడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ.. మత సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావంతో అందరూ కలిసి పండుగలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.









