ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
ఆత్మీయ ఆహ్వానం పలికిన గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (ఆధాబ్ న్యూస్):
తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ఖైరతాబాద్ శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధుల ఆత్మీయ ఆహ్వానం మేరకు ఆయన మహాగణపతిని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆత్మీయంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ వాణి, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిషోర్ యాదవ్, ఉత్సవ కమిటీ సభ్యులు రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 31









