అట్టహాసంగా ప్రారంభమైన 70వ పినపాక జోనల్ స్థాయి క్రీడా పోటీలు
పినపాక, సెప్టెంబర్ 19 (ఆధాబ్ న్యూస్):
పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 70వ పినపాక జోనల్ స్థాయి క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పినపాక, కరకగూడెం మండలాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు పినపాక ఎంఈఓ వీరాస్వామి తెలిపారు.
క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో విద్యార్థుల మార్చ్‌పాస్ట్, క్రీడా జ్యోతి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం వివిధ క్రీడాంశాల్లో పోటీలు ప్రారంభమయ్యాయి. కబడ్డీ, కోకో, వాలీబాల్, రన్నింగ్‌తో పాటు వివిధ అథ్లెటిక్స్ పోటీలను నిర్వహిస్తున్నట్లు పీఈటీ వీరన్న తెలిపారు.
విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, జట్టు భావనను అభివృద్ధి చేయడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వాగబోయిన చందర్‌రావు, ఉప సర్పంచ్ గంగిరెడ్డి సందీప్‌రెడ్డి, పినపాక హెచ్‌ఎం రామిరెడ్డి, పీఈటీలు వీరన్న, అనిల్, వరలక్ష్మి, రాములమ్మ, బాలరాజు, మహేష్, విజయలక్ష్మి, విజయ, మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి, పాఠశాల పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పీఈటీలు, విద్యార్థులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.









