ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  గిరిజనుల సంక్షేమానికి కేసీఆర్ కృషి మరువలేనిది

గిరిజనుల సంక్షేమానికి కేసీఆర్ కృషి మరువలేనిది

కేసీఆర్ చిత్రపటానికి గిరిజన సంఘాలు, బీఆర్ఎస్ నాయకుల క్షీరాభిషేకం

ఆధాబ్ న్యూస్, కరకగూడెం: గిరిజనుల సంక్షేమం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేసుకుంటూ గిరిజన సంఘాలు, బీఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి ఘనంగా క్షీరాభిషేకం నిర్వహించారు. గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన నిర్ణయంతో గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యలో, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో మరిన్ని అవకాశాలు లభించాయని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. 500 జనాభా కలిగిన గిరిజన గుడేలు, తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం ద్వారా గిరిజనులకు స్థానిక పాలనలో భాగస్వామ్యం కల్పించారని పేర్కొన్నారు.

ప్రత్యేక గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ఆయా గ్రామాలకు ప్రభుత్వ నిధులు నేరుగా అందడంతో రహదారులు, తాగునీరు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి జరిగిందన్నారు. మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మార్చడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని తెలిపారు.

గిరిజనుల సంక్షేమం, విద్య, ఉద్యోగాలు, మౌలిక వసతులు, ఆత్మగౌరవం కోసం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గిరిజనుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయని గిరిజన సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధికి చేసిన కృషికి గుర్తుగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి, గిరిజన మండల నాయకులు మలకం వెంకటేశ్వర్లు, కొమరం విశ్వనాథం, తాటి వెంగళరావు, గొగ్గల నారాయణ, తోలెం రామారావు, సోయం సునీల్, ఈసం రఘుబాబు, పడిగా అశోక్, పోగు వెంకటేశ్వర్లు, బైరిశెట్టి చిరంజీవి, గుడ్ల రంజిత్ కుమార్, కటకం లెనిన్, ఏల్లు రామకృష్ణారెడ్డి, పటాన్ యాకుబ్ ఖాన్, నిట్టా ఏడుకొండలు, సయ్యద్ యాకుబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు