ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  రూ.14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్ ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి

రూ.14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్

ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి

ఆధాబ్ న్యూస్ ,చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం ఎస్టీ బాయ్స్ హాస్టల్‌లో వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్న భూక్యా వాల్ సింహ రూ.14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

హాస్టల్‌లో వర్కర్‌గా (కుక్) పనిచేస్తున్న వ్యక్తికి జీతం చెల్లించే విషయంలో వార్డెన్ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. లంచం ఇవ్వడం ఇష్టం లేని కుక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు ముందస్తు ప్రణాళికతో దాడి నిర్వహించారు.

ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం దాడి నిర్వహించి, రూ.14 వేల లంచం తీసుకుంటుండగా వార్డెన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టినట్లు సమాచారం.

మారుమూల ప్రాంతాల నుంచి కూడా అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు ఏసీబీకి అందుతున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తూ లంచం తీసుకుంటున్న వారిని పట్టుకుంటున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు