కొత్తగూడెంలో ప్రజాపాలన దినోత్సవం
కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఆధాబ్ న్యూస్ – కొత్తగూడెం, సెప్టెంబర్ 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు.
మంత్రి తుమ్మల ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి బయలుదేరి 9.30 గంటలకు కొత్తగూడెంలోని ఐడీఓసీకి చేరుకుంటారు. అనంతరం 10 గంటలకు కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు.
కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. మంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Post Views: 35









