SGF మండల స్థాయి క్రీడా పోటీల్లో MJPTBCWR మణుగూరు బాలుర ఘన విజయం
కబడ్డీ, ఖో-ఖోలో ప్రథమ స్థానాలు.. అథ్లెటిక్స్‌లోనూ సత్తా
ఆధాబ్ న్యూస్ – మణుగూరు: మణుగూరు మండల స్థాయిలో నిర్వహించిన SGF క్రీడా పోటీల్లో MJPTBCWR S&JC (బాలుర) మణుగూరు విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో ప్రథమ స్థానాలను కైవసం చేసుకున్నారు.
కబడ్డీ విభాగంలో అండర్-17 బాలుర జట్టు, అండర్-14 బాలుర జట్లు ప్రథమ స్థానంలో నిలిచి ఘన విజయం సాధించాయి. అదేవిధంగా ఖో-ఖో విభాగంలోనూ అండర్-17, అండర్-14 బాలుర జట్లు ప్రథమ బహుమతులు సాధించి తమ సత్తా చాటాయి.
అథ్లెటిక్స్ విభాగంలోనూ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-17 బాలుర విభాగంలో 800 మీటర్ల పరుగులో స్వర్ణం, రజత పతకాలు, 100 మీటర్ల పరుగులో రజత పతకం, షాట్‌పుట్‌లో రజత పతకం సాధించారు.
విద్యార్థులు సాధించిన ఘన విజయాల పట్ల పాఠశాల ప్రిన్సిపల్ రజనీ, ఉమ్మడి జిల్లా RCO చి. రాంబాబు, PET ముంజాల సురేష్తో పాటు అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు. క్రీడల్లో విద్యార్థులు చూపిన ప్రతిభ పాఠశాలకు, మణుగూరు ప్రాంతానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు.
విద్యార్థులు ఇదే స్ఫూర్తితో మరింత కష్టపడి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన PET, ఉపాధ్యాయులు, కోచ్‌లను అభినందించారు.









