ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  నకిలీ పన్నీర్‌పై ఏడాది నిషేధం

నకిలీ పన్నీర్‌పై ఏడాది నిషేధం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. తయారీ నుంచి విక్రయం వరకు బంద్‌

ఆధాబ్ న్యూస్ ,హైదరాబాద్: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా పాలతో తయారు చేయని కృత్రిమ పన్నీర్‌ (నాన్‌ డెయిరీ/ఆర్టిఫిషియల్‌/అనలాగ్‌ పన్నీర్‌)పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కృత్రిమ పన్నీర్‌ తయారీ, ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలను ఏడాది పాటు నిషేధించింది.

ఈ మేరకు రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేయగా, సెప్టెంబర్‌ 10న తెలంగాణ గెజిట్‌లో అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైంది. నిషేధం సెప్టెంబర్‌ 10 నుంచే తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2006లోని సెక్షన్‌ 30(2)(ఎ) కింద ఉన్న అధికారాలను వినియోగించి ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

పాలతో తయారయ్యే అసలైన పన్నీర్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర పదార్థాలతో తయారు చేసే నాన్‌ డెయిరీ, ఆర్టిఫిషియల్‌, అనలాగ్‌ పన్నీర్‌ను ఏ రూపంలో ఉన్నా తయారు చేయడం నుంచి విక్రయించడం వరకు నిషేధం వర్తించనుంది.

హోటళ్లు, రెస్టారెంట్లకు వర్తింపు

రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు, విక్రయ సంస్థలు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కృత్రిమ పన్నీర్‌ను తయారు చేయడం, నిల్వ చేయడం, సరఫరా చేయడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2006తో పాటు సంబంధిత నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రత అధికారులు తనిఖీలను ముమ్మరం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పన్నీర్‌ తయారీ కేంద్రాలు, నిల్వ కేంద్రాలు, విక్రయ సంస్థల్లో కృత్రిమ పన్నీర్‌ తయారీ, నిల్వ, సరఫరా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు