ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోరుతూ ధర్నా.. యువనేత గుడ్ల రంజిత్ కుమార్ ముందస్తు అరెస్ట్
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ సెప్టెంబర్ 11: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో పాల్గొనేందుకు సిద్ధమైన యువనేత గుడ్ల రంజిత్ కుమార్ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
ధర్నాకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా రంజిత్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయన్ను పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ధర్నా కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని నాయకులు విమర్శించారు.









