ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  కేసీఆర్‌కు ఏమైనా జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి – ఫామ్‌హౌస్‌పై దాడికి యత్నించిన వారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలి – కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణ జరపాలి – ప్రతిపక్ష నేతకు రక్షణ లేకుండా పోతుంది – మళ్లీ కేసీఆర్‌ జోలికొస్తే తాట తీస్తాం: బీఆర్‌ఎస్‌ నాయకులు

కేసీఆర్‌కు ఏమైనా జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి

– ఫామ్‌హౌస్‌పై దాడికి యత్నించిన వారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలి
– కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణ జరపాలి
– ప్రతిపక్ష నేతకు రక్షణ లేకుండా పోతుంది
– మళ్లీ కేసీఆర్‌ జోలికొస్తే తాట తీస్తాం: బీఆర్‌ఎస్‌ నాయకులు

కరకగూడెం, సెప్టెంబర్‌ 09 (ఆధాబ్‌ న్యూస్‌):

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఫామ్‌హౌస్‌ వద్ద చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్‌ భద్రతకు ముప్పు కలిగించేలా జరిగిన ఈ పరిణామాలపై కరకగూడెం మండల బీఆర్‌ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు ఏమైనా జరిగితే అందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

బుధవారం కరకగూడెం మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు రావుల సోమయ్య ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కరకగూడెం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఈ ఘటనపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్ద జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం కేసీఆర్‌ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని, తెలంగాణ సాధకుడిగా, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. కేసీఆర్‌ ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ నాయకులు ఇలాంటి పరిణామాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ భద్రతకు ముప్పు కలిగించే ఏ చర్యనైనా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఆయనను భయభ్రాంతులకు గురిచేసేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఫామ్‌హౌస్‌ వద్ద జరిగిన ఘటన వెనుక ఉన్న వ్యక్తులు, వారి ఉద్దేశాలు, వారికి సహకరించిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

“ప్రతిపక్ష నేతకు రక్షణ లేకుండా పోతుంది” అని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్‌ భద్రత విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

“మళ్లీ కేసీఆర్‌ జోలికొస్తే తాట తీస్తాం” అంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు హెచ్చరించారు. రాజకీయ విభేదాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని సూచించారు.

కేసీఆర్‌కు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. పోలీస్‌ శాఖ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య, సర్పంచ్‌ కొమరం సత్యనారాయణ, మండల నాయకులు కొమరం రాంబాబు, బుడగం రాము, గుడ్ల రంజిత్‌ కుమార్‌, కటకం లెనిన్‌, ఎల్లు రామకృష్ణారెడ్డి, గోగ్గల సతీష్‌, సాధనపల్లి లక్ష్మీనారాయణ, బందు సతీష్‌, సయ్యద్‌ యాకూబ్‌ పాషా, ముత్యాల మధు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు