ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  అక్షరాస్యతతో ఉన్నత లక్ష్యాలను సాధించాలి.ఎంపీడీవో పి. శ్రీనివాస్  కరకగూడెంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ర్యాలీ, సమావేశం

అక్షరాస్యతతో ఉన్నత లక్ష్యాలను సాధించాలి.ఎంపీడీవో పి. శ్రీనివాస్ 

కరకగూడెంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ర్యాలీ, సమావేశం

కరకగూడెం, ఆధాబ్ న్యూస్: అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్‌డీఏ-సెర్ప్, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలో అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించారు. అక్షరమాల పక్షోత్సవాల్లో భాగంగా గత ఏడాది ఉల్లాస్‌ కార్యక్రమం “అమ్మకు అక్షర మాల” ద్వారా విద్యను అభ్యసించిన అభ్యాసకులు, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అనంతరం సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీవో పి. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించడంతో పాటు తమ చుట్టూ ఉన్న వారికి కూడా విద్యను అందించాలని సూచించారు. చదువును మధ్యలో నిలిపివేసిన వారు ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ద్వారా విద్యను కొనసాగించేలా ప్రోత్సహించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎపీఎం సెర్ప్ బి. వినోద్ క్రాంతి, హైస్కూల్ ఇన్‌చార్జి పుష్పలత, సీసీలు విజయలక్ష్మి, సత్యనారాయణ, మండల సమాఖ్య అధ్యక్షురాలు సరస్వతి, ఉపాధ్యాయులు, వీవోఏలు, అభ్యాసకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు