ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కరకగూడెంలో కాంగ్రెస్ నిరసన

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కరకగూడెంలో కాంగ్రెస్ నిరసన

కరకగూడెం, సెప్టెంబర్ 7 (ఆధాబ్ న్యూస్): తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కరకగూడెం మండల కేంద్రంలోని అంబేద్కర్–రాజీవ్ సెంటర్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ, డీసీసీ పిలుపు మేరకు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ.. దళిత వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్నారని, ఆయనపై అనుచిత పదజాలంతో వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. రాజకీయ భేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత గౌరవాన్ని, స్పీకర్ పదవి ఔన్నత్యాన్ని కించపరిచేలా మాట్లాడటం సమర్థనీయం కాదన్నారు.

అసెంబ్లీ ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపించే ప్రజాస్వామ్య వేదిక అని, దానిని రాజకీయ రచ్చబండగా మార్చకూడదన్నారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో టీ-షర్టులు విప్పి బనియన్‌తో రావడం ఏం రాజకీయ సంస్కారమని ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, బాధ్యత, హుందాతనం పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా వ్యవహరించడం, సభలో రచ్చ, దౌర్జన్యాలకు పాల్పడటం ప్రజాప్రతినిధులకు తగదని అన్నారు. అసెంబ్లీ గౌరవాన్ని, ప్రజాస్వామ్య విలువలను ప్రతి ఒక్కరూ కాపాడాలని సూచించారు.

ఎమ్మెల్సీ తాతా మధు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీపై తగిన చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని కోరారు. లేనిపక్షంలో దళిత, బహుజన వర్గాల మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తున్న బీఆర్‌ఎస్‌కు రాబోయే రోజుల్లో ప్రజలే ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఎర్ర సురేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగబండి వెంకటేశ్వర్లు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు చౌలం కేశవరావు, ఉపాధ్యక్షుడు కల్తి విజయ్, సర్పంచులు పోలేబోయిన సుజాత, తోలెం రమాదేవి, ఎర్రం పొట్టయ్య, తోలెం సావిత్రి, ఎల్లబోయిన ముత్తమ్మ, బాడిష పార్వతి, ఉపసర్పంచ్ పూజారి వెంకన్న, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జాడి శ్రీను, మండల నాయకులు షేక్ రఫీ, చందా నాగేశ్వరరావు, సీనియర్ నాయకుడు నేతాజీ, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు