ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు అక్రమ అరెస్టులకు బీఆర్‌ఎస్‌ పార్టీ భయపడదు ప్రజల కోసం నిరంతరం పోరాడుతాం అక్రమ అరెస్టులను నిరసిస్తూ కరకగూడెంలో నల్లజెండాలతో బీఆర్‌ఎస్‌ నిరసన

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు

అక్రమ అరెస్టులకు బీఆర్‌ఎస్‌ పార్టీ భయపడదు

ప్రజల కోసం నిరంతరం పోరాడుతాం

అక్రమ అరెస్టులను నిరసిస్తూ కరకగూడెంలో నల్లజెండాలతో బీఆర్‌ఎస్‌ నిరసన

కరకగూడెం, సెప్టెంబర్‌ 7 (ఆధాబ్ న్యూస్): అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం కరకగూడెం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ కరకగూడెం మండల అధ్యక్షుడు రావుల సోమయ్య మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ సాక్షిగా గేటు వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు వెళ్తున్న ప్రజాప్రతినిధులపై పోలీసుల చర్యలు సరికావని అన్నారు.

అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో బీఆర్‌ఎస్‌ పార్టీని, నాయకులను భయపెట్టలేరని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని, ప్రజల గొంతుకగా బీఆర్‌ఎస్‌ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని సోమయ్య విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు కొనసాగిస్తుందని రావుల సోమయ్య తెలిపారు. ప్రభుత్వం హామీల అమలులో నిర్లక్ష్యం చేస్తే ప్రజలతో కలిసి మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు నల్లజెండాలు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచులు బుడగం రాము, పటన్‌ యాకుబ్‌ ఖాన్, మాజీ సర్పంచులు పాయం నరసింహారావు, పోలెబోయిన నరసింహారావు, మండల నాయకులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి, అత్తె సత్యనారాయణ, యూత్‌ ప్రెసిడెంట్‌ గుడ్ల రంజిత్‌ కుమార్, కటకం లెనిన్, గాంధర్ల సతీష్, తోలెం రామారావు, పడిగా అశోక్, ఈసం రఘు, సయ్యద్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు