మణుగూరు ఏరియా ఆసుపత్రిలో సెప్టెంబర్ 8న కంటి వైద్య శిబిరం
మణుగూరు, ఆధాబ్ న్యూస్: 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మంగళవారం (సెప్టెంబర్ 8) మణుగూరు ఏరియా ఆసుపత్రిలో కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆప్తాల్మిక్ ఆఫీసర్ జి. సంజీవరావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 8న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు చెప్పారు. శిబిరంలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, కంటి శుక్లాలు (క్యాటరాక్ట్) ఉన్నవారిని గుర్తించనున్నట్లు తెలిపారు.
గుర్తించిన కంటి శుక్లాల బాధితులకు త్వరలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించనున్నట్లు పేర్కొన్నారు. పినపాక నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా కంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంజీవరావు సూచించారు.
Post Views: 43









