ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  తుక్కుగూడ నర్సు హత్యాచార ఘటనపై మెజిస్టీరియల్ విచారణ

తుక్కుగూడ నర్సు హత్యాచార ఘటనపై మెజిస్టీరియల్ విచారణ

హైదరాబాద్,ఆధాబ్ న్యూస్:తుక్కుగూడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో నర్సు హత్యాచారానికి గురైన ఘటనను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, బాధితురాలు ఉంటున్న వసతి ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లు, ఆసుపత్రి యాజమాన్యం లేదా సంబంధిత సంస్థ నిర్వహణలో ఏమైనా నిర్లక్ష్యం జరిగిందా, మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలు అమలయ్యాయా అనే అంశాలను విచారణలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కేసులో నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దర్యాప్తును పకడ్బందీగా, వేగంగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. ఫోరెన్సిక్‌ నివేదికలు, ఇతర సాంకేతిక ఆధారాల సేకరణను త్వరితగతిన పూర్తి చేసి సమగ్ర ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేలా పోలీసు ఉన్నతాధికారులు కేసును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందించేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ చేపట్టేలా అవసరమైన చర్యలు ప్రారంభించాలని సీఎం సూచించారు. న్యాయశాఖ, పోలీసు శాఖ, ప్రాసిక్యూషన్‌ విభాగాలు సమన్వయంతో పనిచేసి కేసు విచారణలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు.

బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి అనసూయ సీతక్క బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

ఘటనకు కారణమైన వ్యవస్థాపరమైన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో మహిళా ఉద్యోగుల భద్రతకు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన భద్రతా చర్యలను పటిష్టం చేయాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు