పాత్రికేయుల సేవలు అభినందనీయం
– కరకగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
ఆధాబ్ న్యూస్, కరకగూడెం, సెప్టెంబర్ 6: జర్నలిస్ట్స్ డే సందర్భంగా కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పాత్రికేయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో, సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ప్రజల దృష్టికి తీసుకురావడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా వాస్తవాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకెళ్లే జర్నలిస్టులు ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తున్నారని అన్నారు.
ప్రజల గొంతుకగా నిరంతరం పనిచేస్తున్న ప్రతి ఒక్క పాత్రికేయుడికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ జర్నలిస్ట్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 24









