కరకగూడెం మండలంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
కరకగూడెం, సెప్టెంబర్ 4 (ఆధాబ్ న్యూస్): కరకగూడెం మండలంలో శనివారం (సెప్టెంబర్ 5) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
33/11 కేవీ కరకగూడెం ఉపకేంద్రం పరిధిలోని 33 కేవీ కరకగూడెం లైన్లో మరమ్మతు పనులు, చెట్ల కొమ్మల తొలగింపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ పనుల కారణంగా మండలం మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.
వినియోగదారులు విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Post Views: 28









