ప్రతి క్షణం
ప్రజల పక్షం

  టీవీవీపీకి డైరెక్టరేట్ హోదా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్పు – కేబినెట్

టీవీవీపీకి డైరెక్టరేట్ హోదా

డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్పు – కేబినెట్ ఆమోదం

హైదరాబాద్, ఫిబ్రవరి 24, ఆధాబ్,న్యూస్:
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (TVVP)ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (DSH)గా మార్చాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో డీఎస్‌హెచ్ బిల్లుకు ఆమోదం లభించింది.

ఈ నిర్ణయంతో ఇప్పటివరకు అటానమస్ సంస్థగా కొనసాగుతున్న టీవీవీపీకి ప్రభుత్వ విభాగ హోదా లభించనుంది.
184 ఆసుపత్రులకు కొత్త దిశ

ప్రస్తుతం టీవీవీపీ పరిధిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (CHCs), ఏరియా హాస్పిటళ్లు, జిల్లా ఆసుపత్రులు కలిపి మొత్తం 184 ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు టీచింగ్ హాస్పిటళ్ల మధ్య వారధిగా ఈ ఆసుపత్రులు ప్రత్యేక వైద్య సేవలను అందిస్తున్నాయి.
సమస్యలకు పరిష్కారం

టీవీవీపీ అటానమస్ వ్యవస్థగా ఉండటంతో:

బడ్జెట్ కేటాయింపుల్లో జాప్యం

వేతనాల చెల్లింపులో ఆలస్యం

ఈహెచ్‌ఎస్ వంటి సౌకర్యాల లోపం

వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా వైద్యులు ఈ సంస్థలో పనిచేయడానికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

ఉద్యోగుల డిమాండ్ నెరవేరు

టీవీవీపీ ఉద్యోగులు చాలా కాలంగా డైరెక్టరేట్ హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఇదే విధానం అమలు కావడంతో, తెలంగాణలో కూడా అమలు చేయాలని ఒత్తిడి పెరిగింది.
మంత్రి కృషి

ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా నిపుణులతో అధ్యయనం చేయించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి విషయం తీసుకెళ్లారు.

దీంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఘన సత్కారం

ఈ నిర్ణయం నేపథ్యంలో టీవీవీపీ జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఘన సత్కారం నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ డాక్టర్ వినయ్ కుమార్, కన్వీనర్ సత్యనారాయణ రెడ్డి, కో-చైర్మన్లు, కో-కన్వీనర్లు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!