ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపిన రేగా కాంతారావు
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 25, ఆధాబ్ న్యూస్:
నేటి నుండి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా జిల్లా విద్యార్థులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు అనేవి విద్యార్థుల ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశమని పేర్కొన్నారు. ఎటువంటి భయం, ఆందోళనలకు లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. కష్టపడి చదివిన పాఠాలపై నమ్మకం ఉంచుకుని, క్రమశిక్షణతో మరియు ఏకాగ్రతతో పరీక్షలకు హాజరుకావాలని విద్యార్థులకు సూచించారు.
విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులకు, గురువులకు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, వారు తమ లక్ష్యాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.








