సురక్షిత ప్రయాణానికి జాగ్రత్తలు తప్పనిసరి
అశ్వాపురం సీఐ .అశోక్ రెడ్డి
అశ్వాపురం,ఆధాబ్ న్యూస్:
ప్రజలు రోడ్లపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు.
అశ్వాపురం మండలంలో ఆటోలు, ట్రాక్టర్లలో కూలి పనులకు వెళ్తున్న మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించి, రోడ్డు ప్రమాదాల విషయంలో అప్రమత్తత అవసరమని సూచించారు.
“ప్రమాదం జరిగాక చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే జాగ్రత్తలు పాటిస్తే నష్టాన్ని నివారించవచ్చు. ప్రశాంతతను పరిరక్షించడం ప్రతిఒక్కరి బాధ్యత” అని సీఐ అశోక్ రెడ్డి పేర్కొన్నారు.
అలాగే, పోలీసులు ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తారని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలన్నారు. ప్రమాదాల నివారణ, బాధితులకు న్యాయం చేయడం పోలీసుల ప్రధాన కర్తవ్యమని తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు తదుపరి రోజుల్లో కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Post Views: 41









