భద్రాచలం న్యాయమూర్తికి రాష్ట్ర స్థాయి గౌరవం
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
రాష్ట్ర న్యాయమూర్తుల అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా భద్రాచలం జ్యూడిషియల్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శివ నాయక్ ఎన్నికయ్యారు.
హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో నిర్వహించిన 2025-26 సంవత్సరానికి గాను అసోసియేషన్ ఎన్నికల్లో శివ నాయక్ విజయం సాధించారు.
ఈ విషయాన్ని ఎన్నికల అధికారి మరియు సిటీ సివిల్ కోర్టు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎస్. శశిధర్ రెడ్డి ప్రకటించారు.
ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎన్నికైన శివ నాయక్‌కు న్యాయ వృత్తిలో ఉన్న పలువురు అధికారులు, సహచర న్యాయమూర్తులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా శివ నాయక్ మాట్లాడుతూ – “ఈ గౌరవం నా బాధ్యతను మరింత పెంచింది. న్యాయవ్యవస్థలో పారదర్శకత, న్యాయమూర్తుల సంక్షేమం కోసం కృషి చేస్తాను” అని పేర్కొన్నారు.
Post Views: 31









