ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గిరిజనేతరులకు మేము ఎప్పటికీ అడ్డుకాము – చందా లింగయ్య దొర సమస్యలను సామరస్యపూరితంగా పరిష్కరించుకోవాలి

గిరిజనేతరులకు మేము ఎప్పటికీ అడ్డుకాము – చందా లింగయ్య దొర
సమస్యలను సామరస్యపూరితంగా పరిష్కరించుకోవాలి

కరకగూడెం,ఆధాబ్ న్యూస్: గిరిజనేతరుల సమావేశం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, ఆదివాసీ జాతీయ నాయకుడు చందా లింగయ్య దొర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, “ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనేతరులకు మేము ఎప్పటికీ అడ్డుగా ఉండము. వందల సంవత్సరాలుగా గిరిజనేతరులు, ఆదివాసీలు సోదరభావంతో కలిసి జీవిస్తున్నారు. అలాంటి బంధానికి బిల్లు పడేలా విభేదాలు ఉండకూడదు,” అన్నారు.

అభివృద్ధి దిశగా ఏజెన్సీ ప్రాంతాలు ముందుకెళ్లాలంటే, గిరిజనేతరులు కూడా ఇళ్ళు నిర్మించుకోవడం సహజమని, ఆ అంశంలో చట్టపరమైన వ్యవహారాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని సూచించారు. “చిన్నపాటి సమస్యలు ఉంటే చర్చ ద్వారా పరిష్కారం సాధ్యం. గిరిజనేతరులకు మేము అండగా ఉంటాం” అని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంలో గిరిజనేతరులు చందా లింగయ్య దొరకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న వారు:
కొంపెల్లి రామలింగం, చిట్టి వెంకటేశ్వర్లు, బైరిశెట్టి చిరంజీవి, రావుల సోమయ్య, సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, బుడగం రాము, శ్రీరాం చంద్రయ్య, తిప్పని క్రిష్ణరావు, నాగబండి వెంకటేశ్వర్లు, ముట్టెని ఆదినారాయణ, బైరిశెట్టి వెంకన్న, అక్బర్ ఖాన్, బూరుగడ్డ రవి, కటకం సంతోష్, పూజారి రమేష్, చిట్టి ప్రసాద్, సాయి, శ్రీకాంత్ తదితరులు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!