ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నేతలు
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని పినపాక మాజీ ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్ జన్మదినాన్ని ఉత్సాహంగా జరిపారు. అనంతరం నాయకులు కేటీఆర్ సేవలు, పార్టీ అభివృద్ధిలో ఆయన పాత్రను ప్రశంసించారు.
ఈ వేడుకలో మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, మాజీ ఎంపీపీ రేగా కాలిక, నాయకులు పోగు వేంకటేశ్వర్లు, కొమరం రాంబాబు, సోందు పాష, పాయం నర్సింహారావు, కొమరం విశ్వనాథం, పోలెబోయిన నర్సింహారావు, కనకయ్య, గుడ్ల రంజిత్, లెలిన్, సతీష్, శ్రీను, ప్రవీణ్, లక్ష్మీనారాయణ, ప్రశాంత్, రవి, బిక్షపతి, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.









