ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ రవీందర్ రెడ్డి సూచన

భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ రవీందర్ రెడ్డి సూచన
మణుగూరు,ఆధాబ్ న్యూస్: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ రవీందర్ రెడ్డి సూచించారు. అధికారులు సూచించిన పునరావాస కేంద్రాలకు ప్రజలు తక్షణమే తరలిపోవాలని ఆయన కోరారు.

నదులు, చెరువులు, వాగులు వంటి నీటి ప్రవాహ ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరించారు. ముఖ్యంగా యువకులు ఈత కొట్టడానికి, చేపలు పట్టడానికి ప్రయత్నించవద్దని, అది ప్రమాదకరమని తెలిపారు. ప్రజలు సహకరించకపోతే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!