ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రేగా కాంతారావు ను పరామర్శించిన కేటీఆర్

రేగా కాంతారావు ను పరామర్శించిన కేటీఆర్
కరకగూడం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తల్లి రేగా నర్సమ్మ ఇటీవల పరమపదించడంతో,  వారి స్వగ్రామమైన కరకగూడెం మండలం సమాత్ భట్టుపల్లిలోని నివాసానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు.

నర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రేగా కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, వనమా వెంకటేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!