ప్రతి క్షణం
ప్రజల పక్షం

  విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలి – ఎస్సై పివిఎన్ రావు

 

ఆధార్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బ్యాగులు, పుస్తకాలు, ఆట వస్తువుల పంపిణీ
కరకగూడం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని గొల్లగూడెం, కొత్తగూడెం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన బ్యాగులు, నోట్‌బుక్స్, సరఫరా చేయడం జరిగింది. గురువారం ఈ కార్యక్రమాన్ని ‘ఆధార్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు తోలెం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరకగూడెం ఎస్సై పివిఎన్ రావు మాట్లాడుతూ –
“విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవం గల బోధన సిబ్బంది వల్ల విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు. విద్యారంగం ద్వారా మంచి మార్గాన్ని ఎంచుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులు ఆకాంక్షించాడు
అలాగే, సామాజిక సేవలో పాల్గొనడం ద్వారా వ్యక్తిగతంగా కలిగే సంతృప్తి అమోఘమని, అందరూ సామాజిక బాధ్యతగా తీసుకుని ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల కోసం ఆధార్ సంస్థ చేస్తున్న సేవలు ఎంతో ప్రాశంసనీయమని కొనియాడారు. సంస్థ నిర్వాహకుడు రమేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు విజయ్, సురేష్, ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు, రాధ, శ్రీను, సంస్థ సభ్యులు బట్ట బిక్షపతి, గుడ్ల రంజిత్ కుమార్ ఇర్ప కుశేలుడు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!