కోర్ట్ ఫంక్షనల్ వర్టికల్ లో ఉత్తమ సేవలు అందించిన ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్‌కు ప్రశంస పత్రం
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన నెలవారీ క్రైమ్ సమీక్షా సమావేశంలో, కోర్ట్ ఫంక్షనల్ వర్టికల్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ప్రశంస పత్రంతో సత్కరించారు.
డిసిఆర్‌బీ నుంచి జిల్లా కోర్టులో పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రవీణ్ కుమార్, వివిధ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా సమగ్ర దర్యాప్తు చేపట్టి ఉత్తమ ఫలితాలు సాధించారు. దీనిని గుర్తించిన ఎస్పీ రోహిత్ రాజ్, ఆయన సేవలను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో డిసిఆర్‌బీ డీఎస్పీ ఎన్. మల్లయ్య స్వామి, ఇన్స్పెక్టర్ ఎం. శ్రీనివాస్, ఇతర డిసిఆర్‌బీ సిబ్బంది పాల్గొన్నారు. వారు కూడా ఎస్సై ప్రవీణ్ కుమార్‌ను అభినందించారు.









