హైదరాబాద్ ఆధాబ్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులకు కల్పిస్తున్న ఉచిత హెల్త్ స్కీమ్ పథకాన్ని మరొక ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం వర్తించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. పత్రికా రంగంలో సేవలందిస్తున్న జర్నలిస్టుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ ఖర్చులతో వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ స్కీం ద్వారా జర్నలిస్టులు నిర్దిష్ట ఆసుపత్రులలో ఉచిత వైద్య సేవలు పొందవచ్చు. పాత గడువు జూన్ 30తో ముగియగా, తాజాగా తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. దీనిపై జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
Post Views: 33









