ప్రతి క్షణం
ప్రజల పక్షం

  దివ్యాంగుల కోసం స్వయం ఉపాధి ఋణాల పథకం: జూలై 31 వరకు దరఖాస్తులు

దివ్యాంగుల కోసం స్వయం ఉపాధి ఋణాల పథకం: జూలై 31 వరకు దరఖాస్తులు

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 14 (ఆధాబ్ న్యూస్):
దివ్యాంగుల ఆర్థిక పునరావాస పథకం (E.R.S.) క్రింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రాయితీ లభించే యూనిట్లను మంజూరు చేసింది. ఈ మేరకు అర్హులైన దివ్యాంగులు జూలై 14 నుండి 31వ తేదీ వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి స్వర్ణలత లేనినా వెల్లడించారు.

మంజూరు చేసిన యూనిట్లు వివరాలు:

100% రాయితీతో ₹50,000 విలువ గల 27 యూనిట్లు

80% రాయితీతో ₹1,00,000 విలువ గల 1 యూనిట్

60% రాయితీతో ₹3,00,000 విలువ గల 1 యూనిట్

దరఖాస్తు చేసుకోవాలనుకున్న దివ్యాంగులు https://tgobmms.cgg.gov.in అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయవచ్చు. మరిన్ని వివరాలకు 6301981960, 8331006010 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!