ములుగు జిల్లా మంగపేటలో మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభం
మంగపేట, ఆధాబ్ న్యూస్:
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో అత్యాధునిక మోడల్ పోలీస్ స్టేషన్ను రాష్ట్ర మంత్రి సీతక్క సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శబరీష్, ఏటూరునాగారం ఏఎస్పీ, సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై టీవీఆర్ సూరిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజలకు సమగ్ర భద్రత కల్పించడంలో మంగపేట పోలీస్ స్టేషన్ కీలక పాత్ర పోషించాలన్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా విధులు నిర్వహించాలని అధికారులను కోరారు. కొత్త భవనం ప్రారంభంతో పోలీస్ సిబ్బంది మరింత ఉత్తమ సేవలు అందించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతకుముందు పూజా కార్యక్రమాలతో స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం పోలీస్ అధికారులకు అభినందనలు తెలియజేశారు. స్థానిక ప్రజలు, నేతలు, అధికారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.









