మొహర్రం సందర్భంగా కరకగూడెంలో ఘనంగా సరిగెత్తు ఉత్సవం. కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల కేంద్రంలోని పీరీల(ధర్గ) వద్ద మొహర్రం సందర్భంగా ముజావార్ల ఆధ్వర్యంలో పెద్ద సరిగెత్తు ఉత్సవం కన్నుల పండువగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెల్లవారు జామున ముజావార్లు పీరీలను నిద్రలేపి, సవార్ల వేడుకలను సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. పీరీలను అలంకరించి ఊరేగింపుగా తీసుకువెళ్లగా, భక్తులు పెద్ద ఎత్తున హాజరై పవిత్రతతో పాల్గొన్నారు.
సాయంత్రం గ్రామాలలో సవార్ల ఊరేగింపు నిర్వహించగా, భక్తులు పీరీల వద్ద నీరు ఆరబోసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలవాలూ, అల్లావాలా నినాదాలతో గాలిలో భక్తిశ్రద్ధలు వెల్లివెళ్లాయి.
రాత్రి సమయంలో పీరీల కర్బలు నిర్వహించి, వాటిని గుడిలోని పెట్టెలో భద్రపరచడం ద్వారా వేడుకలకు సంప్రదాయబద్ధంగా ముగింపు పలికారు.









