మెగా ఆధార్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
ఆధార్ కార్డులో తప్పుల సవరణలు చేసుకోవాలనుకుంటున్నవారికి ఇది మంచి అవకాశం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జూలై 9 మరియు 10 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా మెగా ఆధార్ సవరణ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ క్యాంపుల ద్వారా పేరు, వయస్సు, చిరునామా, ఫోన్ నెంబర్, ఫోటో వంటి ఆధార్ సంబంధిత వివరాల్లో మార్పులు చేసుకునే అవకాశముంటుందని కలెక్టర్ వివరించారు. ఆధార్ కార్డులో తప్పులున్న వారు, కొత్త సమాచారం జత చేయాలనుకునే వారు తప్పక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Post Views: 48









