ఏజెన్సీ ప్రాంతంలో కమల రాజశేఖర్ దంపతుల సేవలు అభినందనీయం – డివైఎఫ్ఐ
భద్రాచలం ఆధాబ్ న్యూస్:
ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలంలో చిన్నారులకు వైద్యసేవలందిస్తూ, పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి అనేక సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న డాక్టర్ కమల రాజశేఖర్ దంపతుల సేవలు అభినందనీయమని డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఆది, సతీష్ బాబులు అన్నారు.
బుధవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డాక్టర్ రాజశేఖర్‌ను కలిసి సత్కరించారు. ఆయనకు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా సమయంలో కుకునూరు, దుమ్ముగూడెం, కూనవరం మండలాల్లోని అనేక గిరిజన గ్రామాలకు నిత్యవసర సరుకులను కమల రాజశేఖర్ దంపతులు అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.
డాక్టర్ రాజశేఖర్ స్థాపించిన స్వాతి హాస్పటల్ ద్వారా చిన్నారులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుండటంతో, ఆయన్ను చిన్నారుల సంజీవని అని ప్రశంసించారు. ఇటీవల లైన్స్ క్లబ్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కమల మరింత సామాజిక సేవలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
నిస్వార్థ సేవలను గుర్తించి ప్రోత్సహించడమే తమ లక్ష్యమని డివైఎఫ్ఐ స్పష్టం చేసింది. కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు, మాజీ నాయకులు పోసి, పారిల్లి సంతోష్ కుమార్, సిఐటియు నాయకులు ఎంపీ నర్సారెడ్డి, బండారు శరత్ బాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.









