ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఏడూళ్ల బయ్యారం పెర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు.

ఏడూళ్ల బయ్యారం పెర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు.
పినపాక, ఆధాబ్ న్యూస్: పినపాక
మండల పరిధిలోని ఏడూళ్ల బయ్యారం ఫెర్టిలైజర్ దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.

తనిఖీల్లో భాగంగా ఫెర్టిలైజర్ లైసెన్సులు, నిల్వలు, ధరల పట్టికలు, సరిగ్గా లబ్ధిదారులకు సరఫరా చేస్తున్న తీరుపై అధికారులు పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

వ్యవసాయ సీజన్‌లో రైతులకు నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉండేందుకు ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. రైతులు ఎటువంటి అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!