అశ్వాపురం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
అశ్వాపురం,ఆధాబ్ న్యూస్:
అశ్వాపురం మండల కేంద్రంలోని అశ్వాపురం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చారు.
తరువాత పోలీస్ స్టేషన్లోని రికార్డులు, రిసెప్షన్, లాకప్, మెన్బ్యారక్, టెక్నికల్ రూం, సిబ్బంది నివాస సముదాయాలు (క్వార్టర్స్) తో పాటు స్టేషన్ పరిసరాలను సమగ్రంగా పరిశీలించారు. పోలీస్ సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి విధుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధ్యతలపై సూచనలు ఇచ్చారు.
పోలీసు వ్యవస్థపై ప్రజలు విశ్వాసం పెంచుకునేలా ఎల్లవేళలా ఫిర్యాదులను స్వీకరించాలి, బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి న్యాయం అందించాలని ఆదేశించారు. అదే సమయంలో అసాంఘిక కార్యకలాపాలపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఈ తనిఖీలో మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.









